అమెజాన్ ప్రైమ్ తో ప్రియాంక చోప్రా భారీ ఒప్పందం
- రెండేళ్ల పాటు కొనసాగనున్న కార్యక్రమం
- హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందనున్న ప్రోగ్రామ్
- మహిళలకు సంబంధించిన అంశాలకు మరింత ప్రాధాన్యత ఉంటుందన్న ప్రియాంక
ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో మరింత భారతీయతను ప్రదర్శిస్తామని తెలిపింది. ప్రాంతీయ భేదాలు, భాషా భేదాలు లేకుండా ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే ప్రతిభకు ఒక ప్లాట్ ఫామ్ ను సిద్ధం చేయాలనేది తన కోరికని... అందుకే సొంత నిర్మాణ సంస్థ పర్పుల్ పెబల్ పిక్చర్స్ ను స్థాపించానని చెప్పింది. అమెజాన్ ప్రైమ్ తో చేయి కలపడానికి కూడా ఇదే కారణమని తెలిపింది. మహిళలకు సంబంధించిన అంశాలకు ఇందులో ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది.