భారత్‌లో గత ఐదు దశాబ్దాల్లో 4.58 కోట్ల మంది మహిళల అదృశ్యం.. నివ్వెర పరుస్తున్న ఐరాస నివేదిక
- నివేదిక విడుదల చేసిన ఐరాస జనాభా నిధి
- మహిళలు అత్యధికంగా అదృశ్యమవుతున్న దేశాల్లో చైనాది టాప్ ప్లేస్
- పేదరిక నిర్మూలన విషయంలో భారత్‌ను శ్లాఘించిన ఐరాస
ఇక, మహిళలు అత్యధికంగా అదృశ్యమవుతున్న దేశాల జాబితాలో చైనా తొలి స్థానంలో ఉండగా, భారతదేశం ఆ తర్వాతి స్థానంలో ఉంది. చైనాలో 7.23 కోట్ల మంది మహిళలు గల్లంతు కాగా, 2013-17 మధ్య భారత్‌లో ఏకంగా 4.6 లక్షల మంది బాలికలు అదృశ్యమైనట్టు నివేదిక పేర్కొంది. కాగా, దేశంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు భారత్ అనుసరిస్తున్న తీరును ఐరాస కొనియాడింది. పేదరిక నిర్మూలనలో భారత్ విజయం ప్రపంచానికే విజయమని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు ముహమ్మద్ బందే ప్రశంసించారు.