Namrata: మహేశ్ తో కలిసి నటించే అవకాశం కుదురుతుందేమో చూడాలి: నమ్రత

Namrata Mahesh Answers to Fans Questions
  • మ్యాగీ నూడుల్స్ బాగా చేస్తాను
  • అత్తగారు ఇందిరమ్మ ప్రేమకు ప్రతిరూపం  
  • మహేశ్ సినిమాల్లో కల్పించుకోబోను 
  • 'ఆస్క్ మీ యువర్ క్వశ్చన్' సెషన్ లో నమ్రత
తన భర్త, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారలకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకునే నమ్రత, తాజాగా, 'ఆస్క్ మీ యువర్ క్వశ్చన్' సెషన్ లో పాల్గొని ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మీరు బాగా రుచిగా చేసే వంటకం ఏదని ఓ అభిమాని ప్రశ్నిస్తే, మ్యాగీ నూడుల్స్ అంటూ సమాధానం ఇచ్చారు.

ఇష్టమైన హీరో ఎవరన్న ప్రశ్నకు, ఇది చాలా కష్టమైనదేనంటూనే మహేశ్ బాబేనని, మరో ప్రశ్నకు సమాధానంగా మహేశ్ చిత్రాల్లో ఒక్కడు, పోకిరి, దూకుడు, మహర్షి, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు అంటే ఇష్టమని చెప్పారు. జీవితంలో మధుర క్షణాలు ఏంటన్న ప్రశ్నకు సమాధానంగా, మహేశ్ ను పెళ్లి చేసుకోవడం ఒకటైతే, ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వడం మరోటని అన్నారు.

ఇక ఇతర ప్రశ్నలకు సమాధానంగా, తాను మహేశ్ బాబు సినిమాల్లో అసలు తలదూర్చబోనని, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా ఉంటుందా? అంటే కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. తన తల్లిదండ్రులు మహేశ్ ను ఫస్ట్ టైమ్ చూడగానే తన మాదిరే ప్రేమలో పడిపోయి, పెళ్లికి అంగీకరించారని సమ్రత వ్యాఖ్యానించారు. 

క్రికెట్ లో ధోనీ, కోహ్లీ అంటే ఇష్టమని, భవిష్యత్తులో ఒక్కసారన్నా మహేశ్ తో కలిసి నటించే అవకాశం కుదురుతుందేమో చూడాలని అన్నారు. తన బిడ్డలిద్దరూ బాగానే అల్లరి చేస్తారని, సితార ప్రస్తుతం యూట్యూబ్ లో చానెల్ వీడియోలతో సంతోషంగా ఉందని, సినిమాల్లో ప్రవేశంపై మాత్రం ఇప్పుడే చెప్పలేనని వ్యాఖ్యానించారు.

తన అత్తగారు ఇందిరమ్మ ప్రేమకు ప్రతిరూపమని, తనకు స్విట్జర్లాండ్ లోని ఆల్ఫ్స్ పర్వతాలంటే ఇష్టమని, తృప్తిగా తినేసి, మనశ్శాంతిగా నిద్రపోవడం, నిత్యమూ వ్యాయామం చేయడమే తన అందం, ఆరోగ్యం రహస్యాలని అన్నారు. సితార చాలా తెలివిగా తన షోలకు వచ్చే వారిని ఎంపిక చేసుకుంటుందని, ఆ షోలో తాను ఎప్పుడు పాల్గొంటానో తనకే తెలియదని సమాధానం ఇచ్చారు.
Namrata
Mahesh Babu
Ask Me Your Question

More Telugu News