ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేసిన తెలంగాణ ప్రభుత్వం
- తెలంగాణలో కరోనా బీభత్సం
- విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ హైకోర్టులో పిటిషన్
- పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
అయితే, కరోనా మహమ్మారి విజృంస్తున్న తరుణంలో విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో తన వాదనలు వినిపించింది. ఎంసెట్ సహా అన్ని రకాల ప్రవేశపరీక్షలు వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానానికి స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఎంసెట్, లా సెట్, పాలీసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఎడ్ సెట్ పరీక్షలు వాయిదా పడనున్నాయి.