Rajnath Singh: చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా రక్షణ మంత్రితో మాట్లాడనున్న రాజ్‌నాథ్ సింగ్

 Rajnath Singh to talk to his American counterpart
  • ఈ రోజు సాయంత్రం ఫోనులో చర్చ
  • ప్రాంతీయ భద్రత, సహకారం, సమన్వయంపై మాట్లాడే అవకాశం
  • చైనా తీరుపై మాట్లాడే ఛాన్స్
చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పెర్‌తో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఈ రోజు సాయంత్రం ఫోనులో చర్చించనున్నారు. తూర్పు లడఖ్‌లోని నియంత్రణ రేఖ వద్ద భారత్‌, చైనా మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఇరువురు చర్చించనున్నట్లు సమాచారం.

ప్రాంతీయ భద్రత, సహకారం, సమన్వయం వంటి అంశాలపై వారు కీలక చర్చలు జరపనున్నారు. గాల్వన్‌ లోయ వద్ద చైనా సైన్యం కొన్ని మీటర్ల మేర చొచ్చుకుని వచ్చిందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాతో చర్చలు జరుపుతోంది.
Rajnath Singh
India
China
america

More Telugu News