కరోనా భయమంటే ఇదే... ముద్దులు, కౌగిలింతలకు బై చెప్పిన హీరోయిన్!
- లాక్ డౌన్ తో తీవ్రంగా నష్టపోయిన సినీ పరిశ్రమ
- షూటింగ్స్ ప్రారంభమైనా నటీనటుల్లో ఆందోళన
- శృంగార సన్నివేశాలు చేయబోనన్న రెజీనా కసాండ్రా
తాజాగా, ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ భామ, ఇకపై తాను నటించే సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ ఉండబోవని తెలిపింది. లిప్ లాక్ సన్నివేశాలు, కౌగిలింతలు, బెడ్ రూమ్ సీన్స్ లేకుంటేనే అంగీకరిస్తానని, అటువంటి సీన్స్ లో చేయాలంటే భయంగా ఉండటమే ఇందుకు కారణమని చెప్పింది. భవిష్యత్తులో అన్ని పరిస్థితులూ మారి, పాత రోజులు వస్తే మాత్రం అటువంటి సీన్లు చేయడానికి అభ్యంతరం లేదని చెప్పింది. ఇది రెజీనా భయం మాత్రమే కాదు. మిగతా హీరోయిన్లు అందరిలోనూ ఉన్న భయమేనంటే అతిశయోక్తి కాదేమో.