ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం మృతదేహం.. శరీరంపై గాయాలు.. వీడియో ఇదిగో!
- కోల్ కతాకు 150 కి.మీ. దూరంలో ఉన్న మందర్మానీ బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చిన తిమింగలం
- గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన చూడలేదంటున్న స్థానికులు
- హుటాహుటిన అక్కడకు చేరుకున్న అధికారులు
తిమింగలం ఒడ్డుకు కొట్టుకొచ్చిందనే సమాచారం అందిన వెంటనే... ఈస్ట్ మిడ్నపూర్ జిల్లాకు చెందిన అటవీ, వైల్డ్ లైఫ్, మత్స్యశాఖలకు చెందిన అధికారులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. బంగాళాఖాతం తీరంలో ఉన్న మందర్మానీ బీచ్ కు పర్యాటక ప్రాంతంగా గుర్తింపు ఉంది. మరో టూరిస్ట్ ప్లేస్ దిఘాకు సమీపంలో ఇది ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం పర్యాటకులపై నిషేధం ఉంది.