తెలంగాణలో కరోనా కేసుల వెల్లువ... కొత్తగా 983 మందికి పాజిటివ్
- జీహెచ్ఎంసీ పరిధిలో 816 కేసులు
- ఇవాళ 244 మంది డిశ్చార్జి
- మరో నలుగురి మృతి
కొత్త కేసుల రాకతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,419కి పెరిగింది. ప్రస్తుతం 9 వేల మంది చికిత్స పొందుతుండగా, 5,172 మంది డిశ్చార్జి అయ్యారు. ఇవాళ ఒక్కరోజే 244 మందిని డిశ్చార్జి చేశారు. ఇక, తెలంగాణలో తాజాగా 4 మరణాలు సంభవించాయి. దాంతో కరోనా మృతుల సంఖ్య 247కి పెరిగింది.