గుంటూరు బీటెక్ విద్యార్థిని అశ్లీల వీడియోల కేసులో కొత్తకోణం
- ఇద్దరు యువతుల ప్రమేయం ఉన్నట్టు గుర్తింపు
- వారి అరెస్ట్ కు రంగం సిద్ధం
- బాధితురాలికి మూడేళ్లుగా వేధింపులు
గతంలో ఆ విద్యార్థినిని వరుణ్, కౌశిక్ ప్రేమ పేరిట నమ్మించి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి వీడియోలు తీశారు. అప్పటి నుంచి ఆమెను బెదిరిస్తున్నారు. వారి వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దిశ పోలీసులు ఈ ఘటనలో వరుణ్, కౌశిక్ అరెస్ట్ చేశారు. తాజాగా, ఈ ఘటనతో సంబంధం ఉందని భావిస్తున్న ఇద్దరు యువతులను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు.