Susmita Sen: అభిమాని రాసిన లవ్ లెటర్ కు ముగ్ధురాలైన విశ్వసుందరి

Susmita Sen enjoys a love letter from her die hard fan
  • చాన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సుస్మితాసేన్
  • ఇటీవలే ఆర్య అనే వెబ్ సిరీస్ తో నటనవైపు అడుగులు
  • స్వదస్తూరీతో ప్రేమలేఖ రాసిన అభిమాని
చాన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న విశ్వసుందరి సుస్మితా సేన్ ఇటీవలే ఆర్య అనే వెబ్ సిరీస్ తో మళ్లీ నటనా రంగం వైపు అడుగులేసింది. తన ఆరాధ్య దేవత మళ్లీ నటిస్తుండడంతో ఓ అభిమాని ప్రేమలేఖ రాశాడు. ఈ లేఖ పట్ల సుస్మితాసేన్ ఎంతో ముగ్ధురాలైంది. అంతేకాదు, ఆ లేఖను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసింది. ఇదో అద్భుతమైన లవ్ లెటర్ అంటూ మురిసిపోయింది. అభిమానుల నుంచి ఇంతటి ప్రేమానురాగాలు పొందడం అదృష్టంగా భావిస్తున్నట్టు వెల్లడించింది.

ఏదేమైనా చేతిరాతతో రాసిన ప్రేమలేఖలు అంటే తనకు ఎంతో ఇష్టమని, తనకు వచ్చే ప్రతి లేఖను తాను చదువుతానని స్పష్టం చేసింది. తాజాగా వచ్చిన లవ్ లెటర్ ఎంతో సింపుల్ గా ఉన్నా, ఎంతో ప్రేమను భావోద్వేగాల కలబోతగా అక్షరబద్ధం చేయడం తనకు ఎంతో నచ్చిందని, దీన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని సుస్మిత తెలిపింది. అంతేకాదు, ఆ అభిమాని నిజంగానే పరవశించిపోయేలా ఐ లవ్యూ టూ అంటూ స్వీట్ రిప్లయ్ కూడా ఇచ్చింది.
Susmita Sen
Fan
Love Letter
Bollywood
Miss Universe

More Telugu News