Youth: "చచ్చిపోతున్నా డాడీ" అంటూ సెల్ఫీ వీడియో తీసిన కరోనా బాధితుడు... మూడు గంటల పోరాటంలో ఓటమి

Hyderabad youth dies of corona
  • కరోనాతో మృతి చెందిన హైదరాబాద్ యువకుడు
  • బాయ్ డాడీ అంటూ చివరి పలుకులు
  • వైద్యుల నిర్లక్ష్యం లేదన్న చెస్ట్ ఆసుపత్రి సూపరింటిండెంట్
హైదరాబాద్ జవహర్ నగర్ కు చెందిన రవికుమార్ అనే యువకుడు కరోనా బారిన పడి ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో చేరగా, అత్యంత విషాదకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఊపిరి అందడంలేదని వెంటిలేటర్ పెట్టాలని బతిమాలినా  వైద్యులు వెంటిలేటర్ పెట్టలేదని ఆ యువకుడు మరణానికి ముందు తన సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు. ఊపిరందక గుండె ఆగిపోయేలా ఉందని, చచ్చిపోతున్నానంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. చివరగా "బాయ్ డాడీ" అంటూ అందరి హృదయాలు కలిచివేశాడు. దాదాపు మూడు గంటల పాటు నరకయాతన అనుభవించిన రవికుమార్ మృత్యువుతో పోరాటంలో ఓడిపోయాడు.

దీనిపై ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి వైద్యులు వివరణ ఇచ్చారు. వైద్యుల నిర్లక్ష్యంతో రవికుమార్ చనిపోయాడనడం సరికాదని, కరోనా వైరస్ కారణంగా గుండెపై ప్రభావం పడుతుందని చెస్ట్ ఆసుపత్రి సూపరింటిండెంట్ తెలిపారు. కరోనా వైరస్ యువకుల్లో ఎక్కువగా గుండెపై ప్రభావం చూపిస్తుందని, హార్ట్ దెబ్బతిన్న తర్వాత ఆక్సిజన్ పెట్టినా ప్రయోజనం ఉండదని వివరించారు. రవికుమార్ విషయంలోనూ అదే జరిగిందని స్పష్టం చేశారు.
Youth
Corona Virus
Hyderabad
Selfie Video
COVID-19

More Telugu News