దేశాభివృద్ధి కోసం పీవీ అందించిన సేవలను తరతరాలు గుర్తుంచుకుంటాయి: సీఎం జగన్
- పీవీ శతజయంతి సందర్భంగా ఏపీ సీఎం స్పందన
- ఎంతో వివేకవంతుడైన నేత అంటూ వ్యాఖ్యలు
- జాతిని ఆర్థికస్వేచ్ఛ దిశగా నడిపించారంటూ కితాబు
ఎంతో వివేకవంతుడైన రాజకీయవేత్త, బహుభాషా కోవిదుడు అయిన రావు గారు జాతిని ఆర్థిక స్వేచ్ఛగా నడిపించారని కొనియాడారు. దేశాన్ని పురోభివృద్ధి దిశగా నడిపించే క్రమంలో ఆయన అందించిన సేవలను భావి తరాలు కూడా గుర్తుంచుకుంటాయని వ్యాఖ్యానించారు.