కరోనా కాలంలో రొమాన్స్ సీన్ షూటింగంటే... ఇలా ఫేస్ షీల్డ్ తప్పదేమో!
- ప్రపంచాన్ని మార్చేసిన కరోనా
- ఇప్పుడిప్పుడే మొదలవుతున్న షూటింగ్స్
- ప్రసూతన్ తో రొమాంటిక్ సీన్ పిక్ ను పోస్ట్ చేసిన అపర్ శక్తి
ప్రస్తుతం అపర్ శక్తి ఖురానా 'హెల్మెట్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రసూతన్ హీరోయిన్. ఇందులో ఆమె కళ్లల్లోకి చూస్తూ హత్తుకునే ఓ సన్నివేశం ఉంది. ఆ సీన్ షూటింగ్ లాక్ డౌన్ కు ముందే ముగిసింది. ఇక ఆ రొమాంటిక్ సన్నివేశం తాలూకు ఫోటోను షేర్ చేసిన అపర్ శక్తి, ముందుగా షూటింగ్ జరిగిపోయింది కాబట్టి సరిపోయింది గానీ, లేకుంటే, ఇలా ఫేస్ షీల్డ్ పెట్టుకుని నటించాల్సి వచ్చేదంటూ క్యాప్షన్ పెట్టి ఓ ఫోటోను వదిలాడు. ఇందులో అపర్ శక్తి, ప్రసూతన్ ఫేస్ షీల్డ్ లు ధరించి, రోమాన్స్ చేస్తున్నట్టున్నారు.
ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అయింది. ఇక సినిమా షూటింగ్ లు రెగ్యులర్ గా జరిపే పరిస్థితి వస్తే, రొమాంటిక్ సీన్లను దర్శకులు ఎలా తెరకెక్కిస్తారో చూడాలని వుందంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. అపర్ శక్తి ఆలోచన బాగుందని కితాబిస్తున్నారు.