భయపడక్కర్లేదు.. మన దేశంలో రికవరీ రేటు ఎక్కువగా ఉంది: కేంద్రం
- కేంద్ర ఆరోగ్యమంత్రి నేతృత్వంలో కీలక సమావేశం
- హాజరైన విదేశాంగ, పౌర విమానయాన మంత్రులు
- మరణాల రేటు 3 శాతమేనని డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడి
ముఖ్యంగా, భారీ జనాభా ఉన్న మన దేశంలో కరోనా మరణాల రేటు 3 శాతం మాత్రమేనని వివరణ ఇచ్చారు. దేశంలో కరోనా రికవరీ రేటు 58.13 శాతం అని వెల్లడించారు. పైగా కేసులు రెట్టింపయ్యే కాలం 19 రోజులు అని తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితులపై డాక్టర్ హర్షవర్ధన్ నేతృత్వంలో క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరి, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కూడా పాల్గొన్నారు.