Inzamam Ul Haq: పీసీబీ మెడికల్ స్టాఫ్ పై ఇంజమామ్ మండిపాటు

PCB medical staff is not responding to players says Inzamam
  • పాక్ క్రికెట్ జట్టుపై కరోనా పంజా
  • పీసీబీ మెడికల్ స్టాఫ్ సరిగా స్పందించలేదన్న ఇంజమామ్
  • ఆటగాళ్ల ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదని మండిపాటు
పాకిస్థాన్ క్రికెట్ జట్టును కరోనా మహమ్మారి క్లీన్ బౌల్డ్ చేసింది. ఇంగ్లండ్ టూర్ కు వెళ్లాల్సిన ఆటగాళ్లలో 10 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో మరో 9 మందికి పాజిటివ్ అని తేలింది.

ఈ నేపథ్యంలో, పాక్ క్రికెట్ బోర్డు మెడికల్ స్టాఫ్ పై ఆ దేశ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ మండిపడ్డారు. కరోనా వైరస్ సోకినా... ఆటగాళ్లకు పీసీబీ మెడికల్ స్టాఫ్ సపోర్ట్ ఇవ్వలేదని అన్నారు. సాయం కోసం ఆటగాళ్లు ఫోన్లు చేస్తున్నా... వారు కనీసం లిఫ్ట్ కూడా చేయలేదని మండిపడ్డారు.

పీసీబీలో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు... ఆటగాళ్లను స్వేచ్ఛగా వదిలేయడమే మేలని... వారు సొంతంగానైనా ట్రీట్మెంట్ తీసుకుంటారని చెప్పారు. ఇంజమామ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై పీసీబీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Inzamam Ul Haq
Pakistan
Corona Virus

More Telugu News