ఆస్తుల వేలం సమాచారాన్ని లీక్ చేశారంటూ.. టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ దేవేందర్ రెడ్డిపై వేటు
- ఇటీవల టీటీడీ ఆస్తులను వేలం వేసేందుకు సిద్ధమైన టీటీడీ
- ప్రభుత్వంపై వెల్లువెత్తిన విమర్శలు
- దేవేందర్ రెడ్డి సమాచారం లీక్ చేశారని గుర్తించిన టీటీడీ అధికారులు
దేశ వ్యాప్తంగా ఉన్న టీటీడీ స్థిరాస్తులను ఎస్టేట్ విభాగం పర్యవేక్షిస్తుంటుంది. డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ కలిగిన దేవేందర్ రెడ్డి ఎస్టేట్ అధికారిగా ఉన్నారు. ఆయన వల్లే ఆస్తుల వేలం సమాచారం లీక్ అయిందని అధికారులు గుర్తించారు.