Dasari Narayana Rao: మరోసారి రచ్చ అవుతున్న దాసరి కుటుంబ ఆస్తి వివాదం.. పోలీస్ స్టేషన్ కు చేరిన అన్నదమ్ముల పంచాయితీ!

Property disputes between Dasari Narayana Raos sons
  • అరుణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రభు
  • నాన్న వీలునామా ప్రకారమే నేను ఈ ఇంట్లో ఉంటున్నా
  • అరుణ్ మమ్మల్ని తిట్టి, కొట్టాడు
ప్రముఖ సినీ దర్శకుడు, దివంగత దాసరి నారాయణరావు కుటుంబ ఆస్తి వివాదం మరోసారి తెరైకి వచ్చింది. దాసరి ఇద్దరు కుమారులు ప్రభు, హీరో అరుణ్ కుమార్ ల మధ్య నెలకొన్న వివాదం మరోసారి రచ్చరచ్చ అవుతోంది. ఆస్తి వివాదంలో అన్నదమ్ములు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. అరుణ్ కుమార్ పై తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులకు ప్రభు ఫిర్యాదు చేశారు. తన ఇంట్లోకి అరుణ్ అక్రమంగా చొరబడ్డాడని ఫిర్యాదులో తెలిపాడు.

ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ, నాన్న రాసిన వీలునామా ప్రకారమే తాను ఈ ఇంట్లో ఉంటున్నానని చెప్పారు. తన మనవరాలికి నాన్న ఈ ఇంటిని రాసిచ్చారని అన్నారు. ఈనెల 24 రాత్రి అరుణ్ తన ఇంటి గేటును దూకి లోపలకు ప్రవేశించాడని తెలిపారు. ఆ సమయంలో బాగా తాగేసి ఉన్నాడని... తనను, తన భార్యను, అత్తామామలను దారుణంగా తిడుతూ, కొట్టాడని చెప్పారు. అరుణ్ భార్య కూడా దుర్భాషలాడిందని తెలిపారు. పోలీసుల ముందు కూడా దాడి చేశాడని చెప్పారు.

తమ్ముడై ఉండి కూడా అరుణ్ తనపై, తన కుటుంబంపై దారుణంగా ప్రవర్తిస్తున్నాడని ప్రభు మండిపడ్డారు. ఈ విషయంలో మోహన్ బాబు, సి.కల్యాణ్, మురళీమోహన్ జోక్యం చేసుకోవాలని కోరారు. ఎందువల్లో వీరెవరూ తమ వ్యవహారంపై మాట్లాడటం లేదని చెప్పారు. అందరూ కలిసి తనను ఒంటరి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
Dasari Narayana Rao
Tollywood
sons
Dasari Prabhu
Dasari Arun

More Telugu News