ఇంట్లోనే ఉన్నా.. పోలీసు విచారణకు గైర్హాజరైన వైసీపీ నేత పీవీపీ

  • ఇంటి యజమానిని బెదిరించిన కేసులో కేసు నమోదు
  • ఉదయం అదుపులోకి తీసుకుని రాత్రి వరకు విచారణ
  • ఇంట్లోనే ఉన్నట్టు గుర్తించిన పోలీసులు
బంజారాహిల్స్‌ రోడ్ నంబర్ 14లో ఓ ఇంటి యజమానిని బెదిరించిన కేసులో వైఎస్సార్సీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)ను పోలీసులు బుధవారం ఉదయం అదుపులోకి తీసుకుని రాత్రి 10:30 గంటల వరకు విచారించారు. అనంతరం విడిచిపెట్టిన పోలీసులు మరుసటి రోజు కూడా విచారణకు రావాలని ఆదేశించారు. అయితే, పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేసిన పీవీపీ విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో ఆయన కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు పీవీపీ ఇంట్లోనే ఉన్నట్టు గుర్తించి ఫిలింనగర్‌లోని ఆయన నివాసం వద్ద సిబ్బందిని మోహరించారు.

PVP
YSRCP
Banjara Hills

More Telugu News