సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు రద్దు.... 12వ తరగతి విద్యార్థులకు రెండు ఆప్షన్లు!
- పరీక్షలు రద్దు చేయాలంటూ సుప్రీంలో పిటిషన్
- తాజా నోటిఫికేషన్ జారీ చేయాలన్న సుప్రీం ధర్మాసనం
- తదుపరి విచారణ రేపటికి వాయిదా
పరిస్థితులు అనుకూలిస్తే వీలైనంత త్వరగా సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. అయితే, 12 వ తరగతి విద్యార్థులకు రెండు ఆప్షన్లు ఇస్తున్నామని చెప్పారు. పరీక్షలకు హజరవ్వాలో, వద్దో నిర్ణయించుకునే అవకాశం విద్యార్థులకే ఇవ్వనున్నామని తెలిపారు. లేకపోతే, ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా సర్టిఫికెట్ తీసుకునే వెసులుబాటును కూడా వారికి ఇస్తున్నామని వివరించారు. ఈ ఫలితాలను జూలై 15న వెల్లడిస్తామని పేర్కొన్నారు. దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ, తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.