Raghuramakrishnam Raju: పార్టీ షోకాజ్ నోటీసుపై స్పందించిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు

YSRCP MP Raghuramakrishnam Raju responds on show cause notice
  • నాకు నోటీసులు అందాయి
  • పార్టీని, పార్టీ అధినేతను పల్లెత్తు మాట కూడా అనలేదు
  • సీఎంకు చెప్పాలనుకున్నవి మీడియా ముఖంగా చెప్పాను

పార్టీకి, పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పది రోజులుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నోటీసులో పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడారని, పార్టీ ఎమ్మెల్యేలను కించపరుస్తూ వ్యాఖ్యానించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. వారంలో రోజుల్లో నోటీసుకు సమాధానం ఇవ్వాలని... లేని పక్షంలో క్రమశిక్షణా చర్యలను తీసుకుంటామని నోటీసులో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

ఈ నోటీసుపై రఘురామకృష్ణంరాజు స్పందించారు. తనకు నోటీసులు అందాయని ఆయన తెలిపారు. తాను ఏనాడూ పార్టీని కానీ, పార్టీ అధినేతను కానీ చిన్న మాట కూడా అనలేదని చెప్పారు.

ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు సరిగా అమలు కావడం లేదనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నానని... అయితే, ఆయన అపాయింట్ మెంట్ దొరక్కపోవడంతో మీడియా ముఖంగా చెప్పానని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News