'ఆహా'లో హోస్ట్ గా చేయనున్న తమన్నా!
- డిజిటల్ ప్రపంచంలోకి వస్తున్న తమన్నా
- అల్లు అరవింద్ నేతృత్వంలోని 'ఆహా'తో డీల్
- టాక్ షోకి హోస్టుగా మిల్కీ బ్యూటీ
దీనిని గుర్తెరిగే ఆయా తారలు అటువంటి పరిస్థితిలో ఎటువంటి అవకాశాలు వచ్చినా ఒప్పేసుకుంటూ వుంటారు. ప్రస్తుతం కథానాయిక తమన్నా కూడా అదే రీతిలో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే తాజాగా డిజిటల్ ప్రపంచంలోకి కూడా అడుగుపెడుతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నేతృత్వంలోని 'ఆహా' ఓటీటీ ప్లాట్ ఫాం నుంచి తమన్నాకి ఓ ఆఫర్ వచ్చిందట. అదేమిటంటే, ఓ టాక్ షోకి హోస్ట్ గా వ్యవహరించే ఛాన్స్. డీల్ బాగుండడంతో తమన్నా వెంటనే దీనికి ఓకే చెప్పేసిందని అంటున్నారు.