China: భారత్ పై మరోసారి అక్కసును వెళ్లగక్కిన చైనా

Chinas fresh blame against India
  • భారత విదేశాంగ శాఖ, మీడియా తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నాయి
  • ప్రపంచానికి తప్పుడు సమాచారం వెళ్తోంది
  • చైనా బలగాలను భారత జవాన్లే రెచ్చగొట్టారు
గాల్వన్ లో భారత జవాన్లే తమ బలగాలను రెచ్చగొట్టారని చైనా మరోసారి పాత పాటనే పాడింది. జరిగిన ఘటనపై భారత విదేశాంగశాఖ, ఇండియన్ మీడియా తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నాయని విమర్శించింది. చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ మాట్లాడుతూ భారత్ విదేశాంగ శాఖ, అక్కడి మీడియా చేస్తున్న ప్రచారం వల్ల తప్పుడు సమాచారం వెళ్తోందని అన్నారు.

వాస్తవ పరిస్థితి ఏమిటో అందరికీ అర్థం కావాలని... అందుకే నిజాలను వెల్లడించడమే తన ఉద్దేశమని చెప్పారు. భారత విదేశాంగ శాఖ, రక్షణ శాఖలు కలిసి ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించాయని ఆరోపించారు. రెచ్చగొట్టేందుకు యత్నించాయని అన్నారు.
China
India
Border

More Telugu News