Rashmika Mandanna: టాలీవుడ్ బిగ్ ఆఫర్ ను తిరస్కరించిన రష్మిక!

Rashmika rejects big offer from Tollywood
  • 'సరిలేరు నీకెవ్వరు'తో రష్మికకు మంచి క్రేజ్ 
  • నాని హీరోగా రూపొందే 'శ్యాం సింగ రాయ్'
  • ముగ్గురు నాయికల్లో ఒకరిగా సాయిపల్లవి
  • మరో నాయిక పాత్రను తిరస్కరించిన రష్మిక    
తెలుగులో తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న కథానాయికగా కన్నడ భామ రష్మికను చెప్పుకోవచ్చు. మహేశ్ తో నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా మంచి హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది. దాంతో ఆమెకు ఆఫర్లు కూడా బాగా వస్తున్నాయి. ఈ క్రమంలో నాని హీరోగా నటించే సినిమా నుంచి వచ్చిన ఆఫర్ ను మాత్రం ఈ చిన్నది తిరస్కరించినట్టు సమాచారం.

'టాక్సీవాలా' ఫేం రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా 'శ్యాం సింగ రాయ్' అనే చిత్రం రూపొందనుంది. ఇందులో నాని సరసన ముగ్గురు హీరోయిన్లు వుంటారు. ఒకపాత్రకు ఇప్పటికే సాయిపల్లవిని ఎంచుకున్నట్టు వార్తలొచ్చాయి. మరో హీరోయిన్ పాత్రకు రష్మికను అడిగినట్టూ, చేయడానికి ఆమె నిరాకరించినట్టూ తెలుస్తోంది. అయితే, ఆమె ఈ సినిమాను తిరస్కరించడానికి కారణం.. తన పాత్ర నచ్చలేదా? లేక పారితోషికం సమస్యా? అన్నది వెల్లడికాలేదు.  
Rashmika Mandanna
Nani
Saipallavi
Rahul

More Telugu News