India: దేశ రాజధానిలో పెట్రోల్, డీజిల్ ధరలు సమానం!

Petrol and Diesel Price Almost same in Delhi
  • ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 79.88
  • ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 79.40
  • వ్యాట్ పెంపుదలే కారణమంటున్న నిపుణులు
ఇండియాలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు సమానమయ్యాయి. నేడు వరుసగా 18వ రోజు కూడా ధరలను ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెంచాయి. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తరువాత, నిత్యమూ 'పెట్రో' ధరలను పెంచుకుంటూ పోతుండగా, ఈ 19 రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ పై దాదాపు రూ. 10 వరకూ ధర పెరిగింది. ఇదే సమయంలో ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు సమానమయ్యాయి. ప్రస్తుతం హస్తినలో పెట్రోలు ధర లీటరుకు రూ. 79.88 వుండగా, డీజిల్ ధర రూ. 79.40కి చేరుకుంది.

ఏ దేశంలోనైనా పెట్రోల్ తో పోలిస్తే, డీజిల్ ధర తక్కువగా ఉంటుంది. అయితే, ఢిల్లీలో డీజిల్ వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో ప్రభుత్వం డీజిల్ పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను పెంచుకుంటూ వెళ్లింది. దీంతో రెండు ఇంధనాల ధరలు సమానమయ్యాయి. కాగా, ఇతర మెట్రో నగరాలైన హైదరాబాద్, కోల్ కతా, చెన్నై, ముంబై తదితర ప్రాంతాల్లో మాత్రం ఈ పరిస్థితి ఇంకా రాలేదు.
India
Petrol
diesel
Price

More Telugu News