Cipla: ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు మా కరోనా ఇంజక్షన్: సిప్లా

Cipla Claims their Injection for Corona is Chepest in World
  • ఇంజక్షన్ ధర రూ. 5 వేల కన్నా తక్కువే
  • పది రోజుల్లో మార్కెట్లోకి విడుదల
  • వెల్లడించిన సిప్లా
మరో వారం లేదా పది రోజుల్లో మార్కెట్లోకి రానున్న తమ కరోనా ఇంజక్షన్ ధర ప్రపంచంలోనే అతి తక్కువని సిప్లా సంస్థ పేర్కొంది. దీని ధర రూ. 5 వేల కన్నా తక్కువగానే ఉంటుందని ప్రకటించింది. ఇప్పటికే దేశీయంగా ఈ డ్రగ్ ను విడుదల చేసేందుకు డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా నుంచి సిప్లా అనుమతి పొందిందన్న సంగతి తెలిసిందే.

 కరోనాను నియంత్రిస్తున్న రెమిడీసివిర్ జనరిక్ ఔషధాన్ని తయారు చేసిన సిప్లా, దీన్ని అతి త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. కాగా, తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న హెటిరో సంస్థ కూడా కరోనా ఇంజక్షన్ డ్రగ్ ను విడుదల చేసి, దీని ధర రూ. 5 వేల నుంచి రూ. 6 వేల మధ్య ఉంటుందని ప్రకటించగా, సిప్లా మాత్రం అంతకన్నా తక్కువకే ఇంజక్షన్ ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించడం గమనార్హం.
Cipla
Corona Virus
Injection
Low Price

More Telugu News