saroj khan: శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.. ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ కొరియా గ్రాఫర్ సరోజ్‌ఖాన్

bollywood veteran choreographer Saroj Khan admitted in Hospital
  • కరోనా పరీక్షల్లో నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు
  • 1980-90 దశకంలో కొరియా గ్రాఫర్‌గా పనిచేసిన సరోజ్ ఖాన్
  • కొరియో గ్రాఫర్‌‌గా పలు జాతీయ అవార్డులు
బాలీవుడ్‌కు చెందిన సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ అని రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. రెండు మూడు రోజుల అబ్జర్వేషన్ అనంతరం డిశ్చార్జ్ చేయనున్నట్టు చెప్పారు.

1980-90 దశకంలో కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన సరోజ్ ఖాన్..  శ్రీదేవి, మాధురి దీక్షిత్‌ వంటి పాప్యులర్ హీరోయిన్లతో  అదిరిపోయేలా స్టెప్పులు వేయించారు.  దేవదాస్ సినిమాలోని ‘డోలా రే డోలా’, తేజాబ్ లో మాధురీ దీక్షిత్ ‘ఏక్ దో తీన్’, ‘జబ్ వీ మెట్’ సినిమాలోని ‘యే ఇష్క్ హై’ పాటల కొరియోగ్రఫీకి గాను ఆమె జాతీయ అవార్డులు అందుకున్నారు. సరోజ్ ఖాన్ చివరిసారి మాధురి దీక్షిత్ నటించిన ‘కలంక్‌’ సినిమాలోని కొన్ని పాటలకు నృత్య దర్శకత్వం వహించారు.
saroj khan
Bollywood
Hospital
corona test

More Telugu News