Vidya Pradeep: ప్రొడ్యూసర్ తలచుకుంటే ఏమైనా చేస్తాడు... నన్ను చాలా హింసించారు: తమిళ సినీ నటి విద్యా ప్రదీప్

I Was Tortured in Film Industry says Vidya Pradeep
  • కారణం లేకుండా ఆరు చిత్రాల నుంచి తీసేశారు
  • ఆ సమయంలో హృదయం పగిలిపోయింది
  • తన జీవితంలోని అనుభవాలను వివరించిన విద్య
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఘటన భారత సినీ పరిశ్రమనే కుదిపేసింది. ఎంతో మంది తాము కూడా డిప్రెషన్ లో పడిపోయామని, ఆత్మహత్య చేసుకోవాలని భావించామని, తరువాత కోలుకున్నామని పలువురు తమ జీవితంలోని అనుభవాలను పంచుకున్నారు. తాజాగా తమిళ నటి, ప్రస్తుతం 'తలైవి', 'అసుర కులం' తదితర చిత్రాల్లో నటిస్తున్న విద్యా ప్రదీప్, సినీ రంగంలో తాను ఎంతో టార్చర్ కు గురయ్యానని సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆమె, ప్రొడ్యూసర్లు తలచుకుంటే ఏమైనా చేస్తారని, తనకు వరుసగా ఆరు చిత్రాల్లో అవకాశాలను పోగొట్టారని, కారణాలు లేకుండా తీసేయడంతో తన హృదయం పగిలిపోయిందని, ఈ రంగం సరిపడదని భావించిన సమయంలో 'తడమ్' చిత్రంలో అవకాశం వచ్చిందని చెప్పింది. ఆ సినిమాలో కూడా చాలా భయపడుతూనే నటించానని చెప్పిన విద్య, సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని వారికి కష్టాలు మరింతగా ఉంటాయని, ఒక్కరు కూడా పట్టించుకోరని వాపోయింది. కఠోర శ్రమ, స్వీయ నమ్మకం ఉంటే విజయం సాధించవచ్చని వ్యాఖ్యానించింది.
Vidya Pradeep
Twitter
Producer
Kollywood

More Telugu News