Ranga Reddy District: ఒకసారి పాజిటివ్.. మరోమారు నెగటివ్.. 24 గంటల వ్యవధిలో ఫలితం మారింది!

women tests positive and negative within 24 hours

  • రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ఘటన
  • గ్రామాన్ని కంటెయిన్‌మెంట్ జోన్‌గా ప్రకటించిన అధికారులు
  • తనలో లక్షణాలు లేకున్నా పాజిటివ్ రావడంపై అనుమానంతో రెండోసారి పరీక్షలు

రంగారెడ్డి జిల్లాలో ఓ మహిళ (65)కు 24 గంటల వ్యవధిలో ఓసారి కరోనా పాజిటివ్ అని రాగా, మరోమారు నెగటివ్ అని రావడం కలకలం రేపింది. మొయినాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఈ నెల 21న ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంది. పరీక్షల్లో ఆమెకు కరోనా సంక్రమించినట్టు తేలింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు గ్రామాన్ని కంటెయిన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు.

అయితే, కరోనాకు సంబంధించి తనలో ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ ఫలితం పాజిటివ్‌గా రావడంతో అనుమానించిన సదరు మహిళ ఈసారి మరో ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంది. 22న వచ్చిన ఫలితాల్లో ఆమెకు నెగటివ్ అని వచ్చింది. దీంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. అయితే, ఈ విషయంపై తమకు అధికారికంగా ఎటువంటి సమాచారం అందలేదని వైద్యాధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News