Rashmika Mandanna: కీర్తి సురేశ్ కు కంగ్రాట్స్ చెప్పిన రష్మిక

Rashmika praises keerthi sureshs performance
  • కీర్తి సురేశ్ కథానాయికగా 'పెంగ్విన్'
  • ఓటీటీ ద్వారా విడుదలైన సినిమా 
  • సినిమా చూసిన రష్మిక ప్రశంసలు  
ఒక కథానాయిక సాటి కథానాయిక టాలెంట్ ను ప్రశంసించడం అరుదు. అలాంటిది హాట్ బ్యూటీ రష్మిక తాజాగా మరో కథానాయిక కీర్తి సురేశ్ నటనను ఎంతగానో ప్రశంసిస్తూ అభినందించింది. కీర్తి తాజాగా 'పెంగ్విన్' అనే తమిళ సినిమాలో నటించింది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దీనిని నిర్మించారు. ఈ సినిమాలో కీర్తి గర్భిణి యువతిగా నటించింది. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతబడడంతో ఈ చిత్రాన్ని ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫాం ద్వారా విడుదల చేయడం జరిగింది.

ఇక ప్రస్తుతం షూటింగులు లేకపోవడంతో ఖాళీగా వున్న రష్మిక మందన్న ఈ చిత్రాన్ని ఆన్ లైన్ లో చూసింది. ఆ వెంటనే తన ఇన్ స్టా వేదికగా ఈ ముద్దుగుమ్మ ఆ చిత్రంపై ప్రశంసలు కురిపించింది. 'రాత్రి పెంగ్విన్ చూశాను.. కీర్తీ, నువ్వు కీలకం.. ఎప్పటిలానే నీ అభినయం అద్భుతం. ఈ సినిమా అందరు తల్లులకూ సంబంధించింది. ఈశ్వర్, సుబ్బరాజు సర్.. అందరికీ అభినందనలు' అంటూ రష్మిక ఎటువంటి భేషజాలు లేకుండా తన ప్రశంసలు కురిపించింది.  
Rashmika Mandanna
Keerthi Suresh
Penguin
Karthik Subbaraju

More Telugu News