Budda Venkanna: క‌ల‌లోనూ క‌మ్మ‌నైన క‌ల‌వ‌రింతే.. ఢిల్లీ బాస్ అనే దమ్ము లేదా?: విజయసాయిరెడ్డికి బుద్ధా వెంకన్న కౌంటర్

dont you have guts to say Delhi boss asks Budda Venkanna
  • పార్క్ హయత్ లో నిమ్మగడ్డ రమేశ్, సుజనా, కామినేని భేటీ
  • పార్క్ హయత్ లో కమ్మనైన ప్రజాస్వామ్యం అంటూ విజయసాయి విమర్శ
  • కమలం అనే పదాన్ని పలికేందుకు కూడా వణుకు ఎందుకో అంటూ బుద్ధా ఎద్దేవా
హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, బీజేపీ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ రహస్యంగా భేటీ అయ్యారనే వార్త చర్చనీయాంశమైంది. వీరు హోటల్ లోకి వెళ్తున్న, గదిలో నుంచి వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందిస్తూ, 'పార్క్ హయత్ లో కమ్మనైన ప్రజాస్వామ్యం. దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారు. ఫేస్ టైంలో మాట్లాడిన నాలుగో బిగ్ బాస్ ఎవరు? మరిన్ని వివరాలు అతి త్వరలో...' అంటూ ట్వీట్ చేశారు.

విజయసాయి వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. 'శ‌కుని మామా... నీ అల్లుడు జగన్ స్వామ్యంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్ర‌యోగించి తొల‌గించిన ఎస్ఈసీని చేర్చుకోవాల‌ని కోర్టు ఆదేశించినా ప‌ట్టించుకోకుండా ఉన్నారు. ఇప్పుడాయ‌న ఎవ‌రితో క‌లిస్తే నీకేంటి? క‌ల‌లోనూ క‌మ్మ‌నైన క‌ల‌వ‌రింతే! క‌మ‌లం అనే ప‌దం ప‌ల‌కాల‌న్నా వ‌ణుకెందుకో? ఢిల్లీ బాస్ అనే దమ్ము లేదా?' అని ఎద్దేవా చేశారు.
Budda Venkanna
Telugudesam
Vijayasai Reddy
YSRCP

More Telugu News