ఇండియా ప్రత్యేక విమానాలను అడ్డుకున్న అమెరికా!
- యూఎస్ లో చిక్కుకున్న వారిని తెస్తున్న ఎయిర్ ఇండియా
- ఇతరులకు కూడా టికెట్లను అమ్ముతున్నారంటున్న యూఎస్
- ఏవియేషన్ ఒప్పందానికి విఘాతమని ఆగ్రహం
అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన కంపెనీలు ఇండియాకు విమానాలను నడపకుండా భారత్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఇక్కడి నుంచి ఎయిర్ ఇండియా విమానాలు అమెరికాకు వెళుతుండటంతో, వాటిల్లో సాధారణ ప్రయాణికులు లండన్, ఫ్రాన్స్ తదితర దేశాలకు ప్రయాణాలు సాగిస్తున్నందున అమెరికా ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.
దీంతో ఎయిర్ ఇండియా విమానాలను నియంత్రించాలని భావించిన యూఎస్ ఏవియేషన్ అధికారులు, భారతీయులను స్వదేశానికి చేర్చే ఉద్దేశంతో కాకుండా, వ్యాపార ధోరణితో ఎయిర్ ఇండియా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కరోనా మహమ్మారి వెలుగుచూడక ముందు ఇండియా నుంచి వచ్చే విమానాల సర్వీసులతో పోలిస్తే, ఇప్పుడు సగానికి పైగా సర్వీసులను ఎయిర్ ఇండియా నిర్వహిస్తోంది. ఇదే సమయంలో ఒక్క అమెరికన్ కంపెనీ విమానం కూడా ఇండియాకు రావడం లేదు. ఇదే ఇప్పుడు అమెరికాకు కంటగింపుగా మారింది.