అగ్ర రాజ్యాలు అవస్థలు పడుతున్న వేళ... కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్నామంటున్న నైజీరియా సైంటిస్టులు!
- వాక్సిన్ కోసం ప్రయత్నిస్తున్న 120కి పైగా దేశాలు
- కనుగొన్నామన్న అడిలెక్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు
- మరిన్ని ట్రయల్స్ చేయనున్నామన్న సైంటిస్టులు
ఈ వ్యాక్సిన్ ను ఎవరైనా వినియోగించవచ్చని, ఇదేమీ నకిలీ వ్యాక్సిన్ కాదని, శాస్త్రవేత్తల అంకిత భావానికి దక్కిన ఫలితమని ఈ సందర్భంగా కొలవోల్ వ్యాఖ్యానించారు. ఈ ఇంజెక్షన్ అందరికీ అందుబాటులోకి రావడానికి మరో ఏడాదిన్నర సమయం పడుతుందని, మరిన్ని ట్రయల్స్, విశ్లేషణ చేస్తున్నామని, అధికార వర్గాల నుంచి అనుమతుల కోసం వేచి చూస్తున్నామని ఆయన తెలిపారు.
ఆఫ్రికా మొత్తం విస్తృతంగా వెతికి సార్స్ కోవ్-2 జీనోమ్ ను గ్రహించి, ఎన్నో ప్రయోగాలు చేశామని, శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించారని, ప్రపంచానికి ఈ వ్యాక్సిన్ ఎంతో అవసరమని ఈ సందర్భంగా కొలవోల్ వ్యాఖ్యానించారు.