నెగెటివ్ రోల్ లో కనిపించనున్న సమంత

Actress Samantha to act in negative role
  • వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమంత
  • 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'లో నెగెటిర్ రోల్ పోషిస్తున్న వైనం
  • త్వరలోనే బాలీవుడ్ లో అడుగుపెట్టనున్న సమంత
ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ, వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ సమంత విమర్శకుల ప్రశంసలను సైతం సొంతం చేసుకుంటోంది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో కూడా నటిస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా సమంత అడుగుపెట్టబోతోంది.

'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ కు కొనసాగింపుగా వస్తున్న 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'లో సమంత నటించబోతోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... ఇందులో అక్కినేనివారి కోడలు నెగెటివ్ పాత్రలో కనిపించనుందట. ఈ సిరీస్ లో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను సమంత పూర్తి చేసిందట. ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాదే అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

మరోవైపు, ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్ తో ఓ సినిమాకు సమంత సంతకం చేసిందట. ఇందులో లేడీ ఓరియెంటెడ్ పాత్రను సమంత పోషించనుంది. పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. ఈ సినిమా పట్టాలెక్కితే... సమంత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినట్టవుతుంది.
Go Back to Shorts
Samantha
Bollywood
Tollywood
Web Series

More Telugu News