Bandi Sanjay: హైదరాబాద్‌లో బండి సంజయ్‌ను‌ అరెస్ట్ చేసిన పోలీసులు ‌

police arrests bandi sanjay
  • కోఠి కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ ముట్టడికి యత్నం
  • కరోనా వైరస్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్
  • కరోనా పరీక్షలు చేయటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శ
  • పరీక్షల‌ సంఖ్య పెంచాలని డిమాండ్
హైదరాబాద్‌లోని కోఠి కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముట్టడించేందుకు ఈ రోజు ఉదయం బీజేపీ తెలంగాణ నేతలు ప్రయత్నించారు. దీంతో ఆ పార్టీ  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు  అరెస్టు చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని బండి సంజయ్‌ డిమాండ్ చేస్తున్నారు.

అలాగే, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన సాయంపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. అవసరమైన మేరకు కరోనా పరీక్షలు చేయటంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో లక్షల సంఖ్యలో కరోనా పరీక్షలు చేస్తున్నారని, తెలంగాణలో మాత్రం కనీసం వేల సంఖ్యలో కూడా చేయట్లేదని చెప్పారు. కరోనా పరీక్షల‌ సంఖ్య పెంచాలని, వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Bandi Sanjay
BJP
Police
Hyderabad

More Telugu News