Nani: నాని చిత్రానికి ఓకే చెప్పిన సాయిపల్లవి!

Sai Pallavi in Nanis Latest film
  • నాని తాజా చిత్రం 'శ్యాం సింగ రాయ్' 
  • రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం
  • హైదరాబాదులో కోల్ కతా వాతావరణం సెట్స్  
మన కథానాయికలలో సాయిపల్లవికి ఓ ప్రత్యేకత వుంది. మిగతా వాళ్లలా తను ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పేసుకోదు. కథ నచ్చాలి.. అందులో తన పాత్ర నచ్చాలి.. పాత్ర డీసెంట్ గా వుండాలి.. ఎక్స్ పోజింగ్ వుండకూడదు.. అలా అయితేనే ఆమె ఓకే చెబుతుంది. లేకపోతే వెంటనే సారీ చెప్పేస్తుంది. అలాంటి సాయిపల్లవి తాజాగా నాని సరసన ఓ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

ఆమధ్య 'టాక్సీవాలా' చిత్రాన్ని రూపొందించిన రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయనున్నాడు. దీనికి 'శ్యాం సింగ రాయ్' అనే టైటిల్ ను అప్పుడే నిర్ణయించారు కూడా. ఇందులో కథానాయిక పాత్రకు సాయిపల్లవిని అడిగినట్టూ, కథ నచ్చి ఆమె ఓకే చెప్పినట్టూ తెలుస్తోంది.

ఇక, అసలు లాక్ డౌన్ లేకపోతే ఈ చిత్రం షూటింగ్ ఈ పాటికి చాలా వరకు జరిగిపోయేది. దాని కారణంగా వాయిదా పడింది. ఇక ఇప్పుడు షూటింగులు మొదలు కానున్న నేపథ్యంలో దీనికి ఏర్పాట్లు చేస్తున్నారు. కథ ప్రకారం కోల్ కతా లో చేయాల్సిన షూటింగును హైదరాబాదులోనే సెట్స్ వేసి పూర్తిచేస్తారట.    
Nani
Saipallavi
Rahul
Kolkata

More Telugu News