Mayan Calender: 'ప్రపంచ వినాశనం' ఉత్తుత్తిదే అని తేలిపోయింది... మరోసారి మాయ చేసిన మాయన్ క్యాలెండర్!

Mayan Calender Once Again Prooves Wrong
  • జూన్ 21, 2020ని డూమ్స్ డేగా పేర్కొన్న మాయన్ క్యాలెండర్
  • 1582లో ఉనికిలోకి వచ్చిన క్యాలెండర్ 
  • మాయన్ క్యాలెండర్ మరోసారి తప్పని రుజువు
జూన్ 21, 2020న ప్రపంచం అంతంకానుందన్న వార్త గత కొన్ని నెలలుగా ప్రచారం కావడం, అదే రోజున అమావాస్య, సూర్యగ్రహణం కూడా రావడంతో నిజమేనేమోనని కొందరు ఆందోళనకు గురికాగా, ప్రపంచం నాశనం అవుతుందన్నది చివరికి ఉత్తుత్తిదని తేలిపోయింది. దీంతో మాయన్ క్యాలెండర్ మరోసారి మాయ చేసిందని ఇప్పుడు నెటిజన్లు అంటున్నారు.

డూమ్స్ డే ప్రవచనాల మేరకు నిన్నటితో ప్రపంచం ముగుస్తుందని సిద్ధాంత కర్తలు అంచనా వేయగా, గతంలో మాదిరిగానే ఇది కూడా అబద్ధమేనని రుజువైంది. ఈ క్యాలెండర్ 1582లో ఉనికిలోకి వచ్చింది. అప్పటి ప్రజలు మయాన్, జూలియన్ క్యాలెండర్ లను అనుసరించగా, ప్రస్తుతం చాలామంది గ్రెగోరియన్ క్యాలెండర్ నే అనుసరిస్తున్నారు.

ఇప్పుడు మాయన్ క్యాలెండర్ ను నమ్మే వాళ్లు కొత్త వ్యాఖ్యానాలు చేస్తున్నారు. క్యాలెండర్ మార్చిన సమయంలో 11 రోజులు పోయాయని, దాని ప్రకారం, ఇప్పుడు మనం 2020లో కాకుండా 2012లో ఉన్నట్టని కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. గతంలో 2012 డిసెంబర్ 21న ప్రపంచం అంతమవుతుందని మాయన్ క్యాలెండర్ వెల్లడించగా, అది తప్పని తేలిపోయింది. దానిపై ఓ హాలీవుడ్ చిత్రం '2012' కూడా నిర్మించబడి సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి డూమ్స్ డే విషయంలో మాయన్ క్యాలెండర్ మరోసారి తప్పని రుజువైంది.
Mayan Calender
Worng Prediction
Dooms Day

More Telugu News