Kim Jong-un: చైనాపై ఆగ్రహం.. పొరపాటున కిమ్ జాంగ్ ఉన్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీజేపీ కార్యకర్తలు

BJP leaders fire kim effigy instead of xi jinping
  • గాల్వన్ ఘటనపై నిరసన
  • చైనా అధ్యక్షుడికి బదులు కిమ్ దిష్టిబొమ్మ దగ్ధం
  • సోషల్ మీడియాలో సెటైర్లు
పశ్చిమ బెంగాల్ బీజేపీ నేతలు పొరబడ్డారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు బదులు ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. గాల్వన్ లోయలో చైనా సైన్యం భారత జవాన్లపై దాడులకు నిరసనగా పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌కు చెందిన బీజేపీ నేతలు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అనుకుని, కిమ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పొరపాటును గుర్తించిన కొందరు అదేంటి? కిమ్ దిష్టిబొమ్మను ఎందుకు దగ్ధం చేస్తున్నారని ప్రశ్నిస్తే.. మన సైనికులను పొట్టనపెట్టుకున్నది అతడేనని వారు సమాధానం ఇవ్వడంతో అవాక్కయ్యారు. ఈ ఘటన కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ నేతల పొరపాటుపై కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

Kim Jong-un
xi jinping
West Bengal
China

More Telugu News