రూ.4,500 ఫోన్ బుక్ చేస్తే రూ.80 వేలు పోయాయి!
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన
- సైబర్ నేరగాళ్ల విజృంభణ
- మూడు విడతల్లో డబ్బు కొట్టేసిన వైనం!
అది నిజమే అని నమ్మిన నిషాంత్ తన తండ్రి లఖావత్ మోయీలాల్ పేరిట ఉన్న ఆంధ్రాబ్యాంకు ఖాతా వివరాలు వారికి తెలిపాడు. ఆ తర్వాత కొంతసేపటికి ఆ ఖాతాలోంచి రూ.80 వేలు గల్లంతయ్యాయి. మొదట రూ.20 వేలు, రెండోసారి మరో రూ.20 వేలు, చివరగా రూ.40 వేలు మాయమయ్యాయి.ఈ విషయం తెలిసిన నిషాంత్ తండ్రి వెంటనే ఖాతాను బ్లాక్ చేయించడంతో ఖాతాలో మిగిలిన డబ్బులు నిలిచాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.