నా లేఖకు స్పందించి పది పరీక్షలు రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నా: కన్నా
- ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు
- విద్యార్థుల శ్రేయస్సు కోరి తాను లేఖ రాశానన్న కన్నా
- ప్రజల కోసం బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందంటూ ట్వీట్
ఈ నిర్ణయంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. కరోనా విపత్తు కారణంగా రాష్ట్ర విద్యార్థుల శ్రేయస్సు, భద్రతను దృష్టిలో ఉంచుకుని పదో తరగతి పరీక్షలు రద్దు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశానని తెలిపారు. ఆ లేఖకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరీక్షలు రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ట్వీట్ చేశారు. ప్రజాప్రయోజనాల పరిరక్షణ విషయంలో బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందని ఉద్ఘాటించారు.