Rana: రానా, మిహికల వివాహ వేదికను ఫిక్స్ చేసిన దగ్గుబాటి ఫ్యామిలీ!

Rana and Mihika Wedding in Taj Falaknuma Palace
  • తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ వేదికగా పెళ్లి
  • ఆగస్టు 8న పరిమిత సంఖ్యలో బంధుమిత్రుల మధ్య వివాహం
  • ఇంకా వెలువడని అధికారిక ప్రకటన
టాలీవుడ్ స్టార్ హీరో, దివంగత రామానాయుడి మనవడు రానా వివాహం ఈవెంట్ మేనేజర్ మిహికా బజాజ్ తో నిశ్చయమైన సంగతి తెలిసిందే. ఇద్దరి పెళ్లి ఆగస్టు 8న జరుగనున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా, వీరి పెళ్లి వేదికను దగ్గబాటి ఫ్యామిలీ నిశ్చయించిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్ లోని ప్రతిష్ఠాత్మక తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో వీరి పెళ్లి జరుగనుందట.

పెళ్లి సెట్ రాయల్ థీమ్ ను ప్రతిబింబించేలా ఉంటుందని, ఈ మొత్తం అరేంజ్ మెంట్స్ ను మిహిక స్వయంగా పర్యవేక్షించనున్నారని సమాచారం. ఇక, కరోనా వ్యాప్తి కారణంగా ఈ పెళ్లికి అతికొద్ది మంది మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలోనే అతిథుల మధ్య రానా, మిహికల పెళ్లిని వైభవంగా జరిపించాలని సురేశ్ బాబు, వెంకటేశ్ లు భావిస్తున్నారట. పెళ్లి వేదిక విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. 
Rana
Mihika
Marriage
Taj Falaknuma Palace
Hyderabad

More Telugu News