సరైన నిర్ణయం తీసుకున్నారు... ఏపీలో 'పది' పరీక్షల రద్దుపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు
- ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు
- ప్రభుత్వాన్ని అభినందించిన పవన్ కల్యాణ్
- సీఎం జగన్, ఆదిమూలపు సురేశ్ లకు ప్రశంసలు
నిత్యం వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ఇంతకుముందు ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఘోర తప్పిదంగా భావించారని, అయితే పరీక్షలు రద్దు చేస్తూ సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకున్నారంటూ ప్రశంసించారు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న వేళ పరీక్షల నిర్వహణ ప్రమాదకరమని, నిపుణులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని జనసేన పార్టీ ఏపీ ప్రభుత్వాన్ని కోరిందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. లక్షలాది పిల్లల ప్రాణాలతో చెలగాటమాడవద్దన్న తమ సూచనలపై సహేతుకంగా స్పందించారంటూ ఏపీ సీఎం జగన్ కు, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కు అభినందనలు తెలిపారు.