Glenmark Pharma: కరోనా చికిత్సలో మంచి ఫలితాలనిస్తున్న ఔషధం.. 'ఫాబిఫ్లూ' పేరిట భారత మార్కెట్లో విడుదల!

Glenmark Pharma launches new tablets for corona treatment
  • 'ఫాబిఫ్లూ' పేరుతో మాత్రలు తీసుకువచ్చిన గ్లెన్ ఫార్మా
  • ఆమోదం తెలిపిన భారత ఔషధ నియంత్రణ సంస్థ
  • ఒక్కో మాత్ర ఖరీదు రూ.103

ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్ ను కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న వేళ కొన్ని ఔషధాలు కరోనా చికిత్సలో సమర్థవంతంగా పనిచేస్తూ ఊరట కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఫార్మా సంస్థ గ్లెన్ ఫార్మా భారత మార్కెట్లో సరికొత్త కరోనా ఔషధాన్ని విడుదల చేసింది. ఇది నోటి ద్వారా తీసుకునే యాంటీ వైరల్ డ్రగ్. 'ఫావిపిరావిర్' అనే ఈ మందును 'ఫాబిఫ్లూ' పేరుతో విక్రయించనున్నారు. 'ఫాబిఫ్లూ' మాత్రలను కరోనా చికిత్సలో ఉపయోగించేందుకు కేంద్రం అనుమతించింది. ఈ ఔషధం పనితీరును అంచనా వేసిన భారత ఔషధ నియంత్రణ సంస్థ బాధ్యతాయుతమైన ఔషద వినియోగానికి ఆమోద ముద్ర వేసింది.

దేశంలో పెద్ద సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్న తరుణంలో ఇది శుభవార్తని చెప్పాలి. దీనిపై 'ఫాబిఫ్లూ' తయారీదారు గ్లెన్ ఫార్మా స్పందిస్తూ, క్లినికల్ ట్రయల్స్ లో 'ఫాబిఫ్లూ' ప్రోత్సాహకర ఫలితాలను ఇచ్చిందని వెల్లడించింది. కరోనా రోగులు తొలిరోజు ఫాబిఫ్లూ 1800 ఎంజీ టాబ్లెట్లు రెండుసార్లు వేసుకోవాలని, ఆ తర్వాత 14 రోజుల పాటు 800 ఎంజీ టాబ్లెట్లు రోజుకు రెండుసార్లు వేసుకోవాలని తెలిపింది. కరోనా చికిత్స కోసం విడుదల చేసిన ఫాబిఫ్లూ టాబ్లెట్ ధరను రూ.103గా నిర్ణయించారు.

తేలికపాటి నుంచి మోస్టరు కోవిడ్-19తో బాధపడుతున్న డయాబెటిస్, హృద్రోగ సమస్యలు ఉన్నవారు కూడా ఈ మాత్రలు వాడవచ్చని గ్లెన్ ఫార్మా వివరించింది. 'ఫాబిఫ్లూ' మాత్రలు కరోనా లక్షణాలను, తీవ్రతను 4 రోజుల్లోనే తగ్గిస్తాయని పేర్కొంది.

  • Loading...

More Telugu News