Charmme Kaur: విజయ్ దేవరకొండ 'ఫైటర్'పై క్లారిటీ ఇచ్చిన చార్మీ

వరుస హిట్లతో దూసుకుపోతున్న యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా స్క్రిప్టులో మార్పులు చేశారంటూ వస్తున్న సందేహాలపై నిర్మాత చార్మీ బదులిచ్చారు.

 ఫైటర్ స్క్రిప్టుకు తిరుగులేదని, అందులో మార్పులు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత షూటింగ్ మొదలవుతుందని వెల్లడించారు. ఫైటర్ స్క్రిప్టుపై పూర్తి నమ్మకం ఉందని, ఈ సినిమా అసలు టైటిల్ కూడా త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్. ఈ చిత్ర నిర్మాణంలో బాలీవుడ్ ఫిలింమేకర్ కరణ్ జొహార్ కూడా భాగస్వామి. ఇప్పటికే ముంబయిలో కొంతభాగం చిత్రీకరణ జరిగింది. అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.
Charmme Kaur
Fighter
Script
Vijay Devarakonda
Puri Jagannadh

More Telugu News