Nara Bhuvaneswari: తన తల్లి నారా భువనేశ్వరి పుట్టిన రోజు వేడుకను జరిపించిన లోకేశ్!

Nara Bhuvaneshwari Birth day
  • నేడు భువనేశ్వరి బర్త్ డే
  • స్వయంగా కేక్ తినిపించిన లోకేశ్
  • వైరల్ అవుతున్న ఫోటో
నేడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి భార్య భువనేశ్వరి పుట్టిన రోజు సందర్భంగా, లోకేశ్ స్వయంగా వేడుక జరిపించారు. తల్లితో కేక్ కట్ చేయించి, తినిపించారు. ఇందుకు సంబంధించిన చిత్రాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

"నాకు బెస్ట్ ఫ్రెండ్ గా నిలిచినందుకు కృతజ్ఞతలు అమ్మా. నాకు కష్టపడి పని చేయడాన్ని నేర్పించావు. దయాగుణాన్ని, క్షమాగుణాన్ని నేర్పించావు. ఎప్పుడూ నా క్షేమం కోరుకుని, నన్ను అంటిపెట్టుకునే ఉంటావు. ఎల్లప్పుడూ నా శ్రేయస్సును కోరుకునే నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ వైరల్ కాగా, టీడీపీ అభిమానులు భువనేశ్వరికి శుభాభినందనలు చెబుతూ, ట్వీట్లు పెడుతున్నారు.
Nara Bhuvaneswari
Nara Lokesh
Birthday
Twitter

More Telugu News