Amit Shah: రాహుల్ గాంధీకి నా సమాధానం ఇదే: అమిత్ షా

Amit Shah Reply to Rahul Gandhi
  • నిత్యమూ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు
  • జాతి ప్రయోజనాల కోసం నిలబడాలి
  • ట్విట్టర్ లో వీడియోను పెట్టిన అమిత్ షా
ఇండియా, చైనాల సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ, ఆయనకు తన సమాధానం ఇదేనంటూ హోమ్ మంత్రి అమిత్ షా, తన ట్విట్టర్ లో ఓ ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ లో ఓ సైనికుడి తండ్రి మాట్లాడారు. దేశ భద్రత విషయంలో రాజకీయాలు తేవద్దని ఆయన కోరారు.

"ఓ ధీశాలి అయిన ఆర్మీ మ్యాన్ తండ్రి రాహుల్ గాంధీకి చాలా స్పష్టమైన సమాధానాన్ని ఇచ్చారు. దేశమంతా ఏకతాటిపై ఉన్న వేళ, రాహుల్ గాంధీ కూడా తుచ్ఛమైన రాజకీయాలు పక్కనబెట్టి, జాతి ప్రయోజనాల కోసం నిలబడాలి" అని ఆయన ట్వీట్ చేశారు.

లడఖ్ లో నెలకొన్న పరిస్థితులపై నిత్యమూ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం కూడా ఆయన ఓ ట్వీట్ చేస్తూ, "భారత భూ భాగాన్ని ప్రధాని చైనాకు సరెండర్ చేశారు. ఆ భూ భాగం చైనాదే అయితే, మన సైనికులు ఎందుకు చంపబడ్డారు? వారిని ఎక్కడ చంపారు?" అని ప్రశ్నించారు.
Amit Shah
Rahul Gandhi
Twitter

More Telugu News