Jagan: 'రాజ్యసభ'కు ఎన్నికైన అభ్యర్థులకు సీఎం జగన్ అభినందనలు

CM Jagan congratulates Rajyasabha election winners
  • ఏపీలో నేడు 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
  • వైసీపీ అభ్యర్థుల ఘనవిజయం
  • ఏపీ ప్రజల తరఫున గొంతుక వినిపించాలని సీఎం జగన్ సూచన
ఇవాళ ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, వైసీపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీనిపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. "పార్టీ సహచరులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ రాజ్యసభకు ఎన్నికైనందుకు అభినందనలు, శుభాకాంక్షలు. మీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలను పెద్దల సభలో బలంగా వినిపిస్తారని ఆశిస్తున్నాను" అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
.
Jagan
Rajya Sabha
Elections
Winners

More Telugu News