Nagababu: ఒక కుక్క మనిషిని ఇంతలా ప్రేమిస్తుందా? అంటూ నాగబాబు వీడియో

Nagababu video on dogs
  • కుక్కలపై అభిప్రాయాలు వ్యక్తం చేసిన నాగబాబు
  • తన ఇంట్లో కుక్కలను పేర్లతో సహా పరిచయం చేసిన వైనం
  • విదేశాల్లో జరిగిన ఓ ఘటనను ప్రస్తావించిన మెగాబ్రదర్
మెగాబ్రదర్ నాగబాబు కుక్కలపై ఏకంగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఒళ్లో ఒక కుక్క, అటూఇటూ కుక్కలతో నాగబాబు శునకాలపై తన అభిప్రాయాలు, తన జీవితంలో వాటి స్థానం, గత అనుభవాలు అన్నీ పంచుకున్నారు. చిన్నప్పుడు కుక్కలని పెంచుకుందామనుకుంటే ఇంట్లో వీలయ్యేదికాదని, ఇంట్లో తమ తల్లికి పనిభారం ఎక్కువగా ఉండడంతో కుదిరేది కాదని తెలిపారు. డిగ్రీలో ఉన్నప్పుడు ఓ కుక్కపిల్లను తెచ్చుకున్నామని వివరించారు. అంతేకాదు, ప్రస్తుతం తన వద్ద ఉన్న కుక్కలను పేర్లతో సహా పరిచయం చేశారు.

ఇటీవల విదేశాల్లో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తుండగా, అతడి కుక్క పోలీసులపైకి లంఘించగా, పోలీసులు ఆ కుక్కను తుపాకీతో కాల్చిన ఘటనను నాగబాబు ప్రస్తావించారు. ఆ ఘటన చూడగానే గుండెల్లో కలుక్కుమందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ కుక్క మనిషిని ఇంతలా ప్రేమిస్తుందా అని వ్యాఖ్యానించారు. ఆదిమానవుడు గుహల్లో జీవించిన కాలం నుంచి కుక్కలు అలవాటయ్యాయని, జీవితంలో మనిషి ఒక్కసారైనా కుక్కను పెంచకపోతే జీవితం సంపూర్ణం కాదని పేర్కొన్నారు.
Nagababu
Dogs
Video

More Telugu News