Vizag: హీరో సుశాంత్ సింగ్ మృతితో కుంగుబాటు.. విశాఖ అమ్మాయి ఆత్మహత్య

vizag girl commits suicide
  • సుశాంత్‌కు సుమన్ కుమారి అభిమాని 
  • పదేపదే టిక్‌టాక్‌ వీడియోలు చూసిన అమ్మాయి
  • సుశాంత్‌ మృతిని తట్టుకోలేక ఫ్యాన్‌కు ఉరి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడికి సంబంధించి టిక్‌టాక్‌లో వీడియోలు చూసిన విశాఖ అమ్మాయి ఆవేదనకు లోనై ఆత్మహత్య చేసుకుంది. మల్కాపురం మండలం శ్రీహరిపురం పవన్‌ పుత్ర నగర్‌కు చెందిన సుమన్‌ కుమారి సుశాంత్‌కు అభిమాని. ఆమె పదే పదే టిక్‌టాక్‌ వీడియోలు చూస్తుండేది. కొన్ని రోజులుగా సుశాంత్‌కు సంబంధించిన వీడియోలను పదే పదే టిక్‌టాక్‌లో చూసింది. దీంతో తీవ్ర కుంగుబాటుకు గురై ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Vizag
Bollywood

More Telugu News