Chandrababu: ఓటు వేసిన చంద్రబాబు, బాలయ్య... అచ్చెన్నకు ఇంకా అనుమతి రాలేదన్న టీడీపీ

chandrababu casts vote
  • నాలుగు రాజ్యసభ స్థానాలకు పోలింగ్
  • టీడీపీ తరఫున బాలకృష్ణ తొలి ఓటు
  • ఓటేసేందుకు వచ్చిన రెబెల్ ఎమ్మెల్యేలు వంశీ, మద్దాలి గిరి 
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి నాలుగు రాజ్యసభ స్థానాలకు వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో పోలింగ్ జరుగుతోంది. అసెంబ్లీ కమిటీ హాలు-1లో పోలింగ్ బూత్‌ వద్దకు వచ్చిన పలువురు టీడీపీ నేతలు ఓట్లు వేశారు. ఓటు వేసేందుకు టీడీపీ నేత అచ్చెన్నాయుడు హాజరుకాలేకపోయారు. కస్టడీలో ఉంటూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న ఆయనకు ఇంకా అనుమతి రాలేదని టీడీపీ తెలిపింది.

కాగా, టీడీపీ తరఫున బాలకృష్ణ తొలి ఓటు వేశారు. అనంతరం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు వంశీ, మద్దాలి గిరి కూడా ఓటు వేసేందుకు వచ్చారు.
Chandrababu
Balakrishna
Telugudesam
Atchannaidu

More Telugu News