ప్రీమియం ఫీచర్లతో రూ. 10 వేల కన్నా తక్కువ ధరలో మూడు మైక్రోమ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు!
- అతి త్వరలో మార్కెట్లోకి
- చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదిగే ఆలోచన
- ట్విట్టర్ లో వెల్లడించిన మైక్రోమ్యాక్స్
కాగా, గత సంవత్సరం అక్టోబర్ లో ఐవన్ నోట్ ను విడుదల చేసిన తరువాత మైక్రోమ్యాక్స్ మరో కొత్త మొబైల్ ను మార్కెట్లోకి విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఒకేసారి మూడు స్మార్ట్ ఫోన్లను రంగంలోకి దింపనుంది. ఈ ఫోన్ల ధరలన్నీ రూ. 10 వేల లోపే ఉంటాయని, ట్విట్టర్ లో సంస్థ ప్రకటన చూసిన తరువాత, వినియోగదారులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సంస్థ పేర్కొంది.
ఇదే సమయంలో చైనా ఫోన్లకు ప్రత్యామ్నాయంగా సరికొత్త స్మార్ట్ ఫోన్లను తయారు చేయాలని పలువురు సంస్థకు సూచించగా, తాము ఆ పనిలోనే ఉన్నామంటూ సానుకూల సమాధానం ఇచ్చింది.